సింగరేణి మండలానికి నాలుగు బోరు పంపులు మంజూరు

సింగరేణి మండలానికి నాలుగు బోరు పంపులు మంజూరు

KMM: వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు సింగరేణి మండలానికి ఎంపీ నిధుల నుంచి నాలుగు బోర్వెల్‌ పంపులు మంజూరైనట్లు జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు తెలిపారు. మాదారం, గుంపెల్లగూడెం, పేరుపల్లి, చిన్న మడింపల్లి గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించారని పేర్కొన్నారు.