తమిళనాడు బోటు పట్టివేత.. 7గురి అరెస్ట్
NLR: సముంద్రంలో అక్రమంగా చేపలవేట సాగిస్తున్న తమిళనాడు బోటును అధికారులు పట్టుకున్నారు. మత్స్యకారులు సరిహద్దులు దాటొచ్చి, నిబంధనలకు విరుద్దంగా చేపల వేట సాగిస్తున్న బోటును కృష్ణపట్నం పోర్టుకు పది కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించి వెంబడించి పట్టుకున్నారు. బోటుతో పాటు,ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 5లక్షల విలువ గల చేపలను స్వాధీనం చేసుకున్నారు.