'రైల్వే ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలను వేగవంతం చేయాలి'

'రైల్వే ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలను వేగవంతం చేయాలి'

PLD: రైల్వే ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కోసం తొలగింపులు జరిగితే బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని చెప్పుకొచ్చారు.