HIT TV స్పెషల్: 'సమరం వద్దు.. స్నేహం ముద్దు..!'
WNP: గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే వారికి HIT TV సూచన. పంతాలకి, ప్రతిష్ఠలకు పోయి వ్యక్తిగత దూషణలకు దిగొద్దు. పార్టీ ఏదైనా, అభ్యర్థి ఎవరైనా సోదరభావంతో, స్నేహపూరిత వాతావారణంతో ప్రచారం చేయండి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం కాబట్టి ఓడిన అభ్యర్థులు గెలిచిన వారిని గౌరవించండి. ఒక బాధ్యత గల గ్రామ పౌరుడిగా మీ విలువైన సూచనలు, సలహాలతో గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించండి.