VIDEO: మలికిపురంలో ఆకట్టుకున్న చిత్రాలు
కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మలికిపురానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు నల్లి సంగీత్ ఆదివారం గీసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. స్త్రీ శక్తిని, సమానత్వాన్ని తెలియజేస్తూ కుటుంబం, సమాజం, దేశాభివృద్ధిలో మహిళల పాత్ర అమూల్యమైనదని సంగీత్ తనదైన శైలిలో చిత్రాలను గీశారు. స్త్రీ లేనిదే జననం లేదు, గమనం లేదు, అసలు సృష్టి లేదు అంటూ సందేశం ఇచ్చారు.