ఇంపాక్ట్ ప్లేయర్‌గా సూర్య.. కారణమిదే

ఇంపాక్ట్ ప్లేయర్‌గా సూర్య.. కారణమిదే

IPL 2026: కోల్‌కతాపై ముంబై బ్యాటర్ సూర్య ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటంపై టీమ్ కోచ్ జయవర్ధనే క్లారిటీ ఇచ్చాడు. గజ్జల్లో ఇబ్బందిగా ఉందని సూర్య చెప్పాడని, తర్వాతి మ్యాచ్‌కు 5 రోజుల విరామం ఉండటంతో అతనికి మరింత విశ్రాంతి ఇచ్చేందుకు ఇలా చేశామని జయవర్ధనే తెలిపాడు. టోర్నీ మొత్తం ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. దీనిపై కొత్త కథలేం అల్లొద్దని పేర్కొన్నాడు.