ఇసుక లారీలను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు

ఇసుక లారీలను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు

BDK: మణుగూరు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అక్రమ రోడ్డు ద్వారా ఇసుక రవాణా చేస్తున్న లారీలను శనివారం ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. దానికి నిరసనగా ఇసుక సొసైటీల సభ్యులు ఎఫ్టీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు.