VIDEO: దేవనకొండ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ కలెక్టర్
KRNL: దేవనకొండ ప్రాథమిక పాఠశాలను డిప్యూటీ కలెక్టర్, హౌసింగ్ పీడీ చిరంజీవి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతి గదుల పరిస్థితి, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల పరిశుభ్రతను ఆయన పరిశీలించారు. నీరు సరిగా రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పిల్లలు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎంపీడీవో జ్యోతిని సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.