'ఆడపిల్లల రక్షణ, విద్య, సాధికారతే లక్ష్యం'

'ఆడపిల్లల రక్షణ, విద్య, సాధికారతే లక్ష్యం'

KDP: వేంపల్లి మండలం తాళ్లపల్లి పీహెచ్‌సీ డిప్యూటీ హెల్త్ ఎడ్యూకేటర్ షఫిఉన్నిషా మాట్లాడుతూ..ఆడపిల్లల రక్షణ, విద్య, సమానత్వం, సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం సేవ్ గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. గురువారం గురుకుల మైనారిటీ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. సమాజంలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు.