ఘనంగా 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు
HNK: 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డీసీసీబీ బ్యాంకులో ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కలెక్టర్ స్నేహ శబరీష్, తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహుళ రాష్ట్ర సహకార సంఘాల అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ వారోత్సవాల లక్ష్యం అని తెలిపారు.