'సాగు చేస్తున్న వారికి పట్టాలి ఇవ్వాలి'
AKP: అటవీ శాఖకు చెందిన భూముల్లో జీడి తోటలు సాగు చేస్తున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని కోటవురట్ల మండలం అణుకు గ్రామానికి చెందిన గిరిజనులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం చౌడువాడ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అలాగే, జీడీ పిక్కలకు కిలో రూ.200 మద్దతు ధర ప్రకటించాలని, వాటిని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలన్నారు.