పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
SRPT: కోదాడ నుంచి అనంతగిరి వెళ్తున్న మార్గంలో ఖానాపురం గ్రామ శివారులో ఓ కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఉదయం 10 గంటలకు సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కారు వేగంగా పొలాల్లోకి వెళ్లినప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.