VIDEO: మౌనం వహించి నివాళులర్పించిన కేటీఆర్
HYD: 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ చారి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మార్పణ చేసిన సాయి ఈశ్వర్ చారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.