పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ
చిత్తూరు: గుడుపల్లి మండలంలో సోమవారం పీఎం కుసుమ పథకం కింద 30 ఎకరాలలో 5 మెగావాట్లు సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ భూమి పూజ చేశారు. సీఎం చంద్రబాబు సూచనతో రైతులు ముందుకు వచ్చి భూమిని అందించారని అయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ శాంతరామ్, రెస్కో ఛైర్మన్ ప్రతాప్ కూడా పాల్గొన్నారు.