సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: అయినవిల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ మట్టపర్తి నాగ విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొని మండలంలోని అభివృద్ధి పనులపై సమీక్షించారు. మండల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.