VIDEO: 'కోతుల బెడదను తొలగించండి'
KMR: బాన్సువాడ మండలం కోనాపూర్‌లో కోతుల సంఖ్య పెరిగిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం కోసం జన ఆవాసాల్లోకి చొరబడుతున్న కోతులు.. నిత్యావసర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు, ఇళ్ల పైకప్పులను కూడా పాడు చేస్తున్నాయి. కోతుల బెడద కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.