ప్రారంభమైన వినాయక నిమజ్జన శోభాయాత్ర

ప్రారంభమైన వినాయక నిమజ్జన శోభాయాత్ర

NZB: బోధన్ పట్టణంలో వినాయక శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ శివాలయం నుంచి వినాయక నిమజ్జన శోభాయాత్రను సబ్ కలెక్టర్ వికాస్ మహతో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. బోధన్ ఏపీసీ శ్రీనివాస్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, వంద మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.