రైతులకు డ్రోన్లు అందజేసిన MLA
GNTR: ప్రత్తిపాడు మండలంలోని కోయవారిపాలెం, పెద్దగొట్టిపాడు గ్రామాలకు చెందిన రైతు గ్రూపులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు డ్రోన్లు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పటానికి ఇదొక నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.