అనకాపల్లిలో పోలింగ్ బూత్ల వద్దకు భారీగా చేరుకున్న ఓటర్లు

అనకాపల్లి: జిల్లాలో ఉదయం 7గంటలకే పోలింగ్ మొదలైంది. అన్ని పోలింగ్ బూత్ల వద్దకు ఓటర్లు ముందుగానే చేరుకుని క్యూ లైన్లో నిలబడ్డారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కు వినియోగించేందుకు భారీగా తరలి వచ్చారు. ఓటర్ల కోసం ప్రతి బూత్ వద్ద మంచి నీటి సౌకర్యం, టెంట్లు ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్లను బూత్ లోపలకి అనుమతించడం లేదని అధికారులు పేర్కొన్నారు.