'మహిళల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం'
MNCL: మహిళల భద్రతే షీ టీమ్స్ లక్ష్యమని మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక అల్ఫోర్స్ స్మార్ట్ హైస్కూల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా డ్రగ్స్ సేవించినా, మహిళలను వేధించినా వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్ నెంబర్ 6303923700కు ఫిర్యాదు చేయాలని సూచించారు.