విద్యార్థులకు 100 రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులు
GNTR: విద్యలో వెనుకబడిన 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను కొల్లిపరలో నిర్వహిస్తున్నామని ఎంఈవో ఝాన్సీలత పేర్కొన్నారు. ఆదివారం నుంచి శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు.. పాఠశాలకు హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించామని తెలిపారు. శిక్షణ తరగతులు రెండో శనివారం, ఆదివారాలు కూడా జరుగుతాయని చెప్పారు.