'మొక్కలు నాటి వాతావరణాన్ని పరిరక్షించాలి'

VZM: మొక్కలు నాటి వాతావరణాన్ని పరిరక్షించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు కోరారు. నెల్లిమర్ల మండలం ఆల్తిపాలెం పీతకోనేరు గట్టుపై మంగళవారం కొబ్బరి మొక్కలు నాటారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం పండ్ల మొక్కలు పెంపకాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.