అలర్ట్.. నేడు జిల్లాకు వర్ష సూచన

GNTR: జిల్లాలో బుధవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణాలు అవసరమైతేనే చేయాలని సూచించారు.