ప్రైవేటీకరణపై వైసీపీ మండిపాటు
VZM: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు ఎస్.కోట మండలంలోని పలు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఉచిత మెడికల్ కళాశాలను వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకరించడంపై మండిపడ్డారు.