గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

CTR: సదుం మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. ఎర్రాతివారి పల్లె మార్గంలోని సీతమ్మ చెరువు కింద ఉన్న బావి సమీపంలో సుమారు 55 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు లుంగీ, తెల్ల షర్టు ధరించి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.