తప్పిపోయిన బాలుడిని అప్పగించిన పోలీసులు

తప్పిపోయిన బాలుడిని అప్పగించిన పోలీసులు

మేడ్చల్: తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకు కూకట్‌పల్లి పోలీసులు చేర్చారు. కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద సోమవారం ఉ.10 గంటలకు ఓ బాలుడు పెట్రోలింగ్ పోలీసులకు కనిపించాడు. స్టేషన్‌కు తీసుకొచ్చిన ఆ బాలుడు గురించి ఆరా తీశారు. బాలుడి ఫొటోలు గ్రూప్‌లో షేర్ చేశారు. అది వైరల్ కావడంతో ఆ బాలుడి తల్లి స్టేషన్‌కు వచ్చింది. నిర్ధారించుకుని కుమారుడిని ఆమెకు అప్పగించారు.