'గ్రంథాలయాలు ప్రజలను ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతాయి'
SRCL: వేములవాడలో ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలు ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాయని ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం అన్నారు. రంగవల్లి విజ్ఞాన కేంద్రం వార్షికోత్సవ సభలో 'ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత' అనే అంశంపై ఆయన స్మారకోపన్యాసం చేశారు. ప్రజా గ్రంథాలయాలు ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతాయని, మార్పు కోసం పనిచేస్తాయని ఆయన కొనియాడారు.