నల్ల మల్లారెడ్డి కాలేజీలో అయ్యప్ప భక్తుల ఆందోళన

నల్ల మల్లారెడ్డి కాలేజీలో అయ్యప్ప భక్తుల ఆందోళన

మేడ్చల్‌లోని నల్ల మల్లారెడ్డి కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్న ఓ విద్యార్థిని కాలేజీ సిబ్బంది అవమానించారని అయ్యప్ప భక్తులు ఆందోళన చేస్తున్నారు. మాల వేసుకుని కాలేజీకి రావడంతో సిబ్బంది బలవంతంగా నల్ల దుస్తులు విప్పించి యూనిఫామ్ వేయించారని విద్యార్థి ఆరోపించాడు. దీంతో ఆగ్రహించిన అయ్యప్ప స్వాములు కాలేజీ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.