VIDEO: తగ్గిన మంజీరా నది తీరం నీటిమట్టం
SRD: మనూరు మండలం రాయిపల్లి, పులుకుర్తి శివారులోని మంజీరా నది తీరం నీటిమట్టం బాగా తగ్గిపోయింది. దిగువన సింగూర్ ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా స్టోరేజ్ జలాలన్నీ దిగువకు వదిలేయడంతో ప్రాజెక్టు ఖాళీ అయి కేవలం 8 TMCల నీళ్లు మాత్రమే మిగిలాయి. తద్వారా నది తీర ప్రాంతాల్లో నీళ్లు అందక చెరుకు, అరటి, మొక్క జొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.