'రోగులకు మెరుగైన వైద్యం అందించాలి'
ADB: చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్వైజర్ సుభాష్ అన్నారు. రూరల్ మండలంలోని పారామెడికల్ ఆరోగ్య కార్యకర్తలకు శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన పనులపై వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో డా.సర్ఫరాజ్, దీపిక, ఆశా కిరణ్, శకుంతల, తదితరులున్నారు.