VIDEO: జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
ప్రకాశం: బేస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద జాతీయ రహదారిపై సోమవారం రెండు లారీలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత, వేప నూనెతో వెళ్తున్న ట్యాంకర్ రోడ్డు మధ్యలో అడ్డంగా నిలిచి మంటలు అంటుకోవడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.