VIDEO: రంగశాయిపేట కాలేజ్ గ్రౌండ్‌లో బీరు సీసాలు
వరంగల్ రంగశాయిపేట కాలేజ్ గ్రౌండ్ మద్యం ప్రియులకు రాత్రివేళ అడ్డాగా మారింది. పట్టపగలే గ్రౌండ్లోని స్టేజ్ పై గుర్తుతెలియని వ్యక్తులు బీర్ సీసాలు పగులగొట్టారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్, పిల్లలు, వృద్ధులు వ్యాయామం చేసుకునే ఈ ప్రదేశంలో ఇలా జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ యాజమాన్యం, పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.