టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి

కామారెడ్డిలోని టీఎన్జీవోస్ (TNGOs) యూనియన్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, దేశాభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని వెంకట్ రెడ్డి కొనియాడారు.