జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అసీమ్ బిన్ అబ్దుల్లా

జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అసీమ్ బిన్ అబ్దుల్లా

మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్న శంకరంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అసీమ్ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. మొత్తం 54 ఓట్లు పోలవ్వగా ఆసీమ్ బిన్ అబ్దుల్లాకు 41 ఓట్లు, గీత అగర్వాల్ 13 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలను స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించగా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేసన్న ఎన్నికల అధికారిగా వ్యవహారించారు.