విడాకుల కేసు.. హైకోర్టు సంచలన తీర్పు
కేవలం వాట్సప్ సంభాషణల ఆధారంగా దంపతులకు విడాకులు మంజూరు చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. క్రూరత్వం కింద దాఖలైన పిటిషన్లలో కేవలం చాటింగ్‌లను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని పేర్కొంది. సరైన విచారణ జరగకుండా కేవలం డిజిటల్ సందేశాల ఆధారంగా విడాకులు ఇవ్వడం చెల్లదని, గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దూ చేస్తూ ఆ విడాకులు చెల్లవని స్పష్టం చేసింది.