పైపులైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

పైపులైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: కొండాపురం మండలం పెంజి అనంతపురం చిత్రావతి నది దగ్గర రూ. 7కోట్లతో పైపులైన్‌లను ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత పనులను జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడి నుంచి ముచ్చుమర్రి, కొండాపురం, ఓబన్నపేట, చౌటపల్లి తదితర గ్రామాలకు పైపుల ద్వారా మంచినీటి సరఫరా చేస్తారు. ఆయన వెంట భూపేష్ రెడ్డి, బీజేపీ నాయకుడు శివ నారాయణ రెడ్డి ఉన్నారు.