ఆత్మహత్యల నివారణ పై అవగాహనా సదస్సు

TPT: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 మరియు 16 ఆత్మ హత్యల నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్స్ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థులలో ఆత్మధైర్యం పెంచటం అని వివరించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.మాధవి వై.అనిత మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.