సీఎం పర్యటనను అడ్డుకుంటాం: శివశంకర్

NGKL: సీఎం రేవంత్ రెడ్డి NGKL జిల్లా పర్యటనను అడ్డుకుంటామని స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ అన్నారు. బడుగు బలహీన వర్గాలను అణిచివేస్తున్న రేవంత్ రెడ్డి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని నిలదీశారు. గురుకులాల్లో సరైన వసతులు కల్పించండి అని అడిగినందుకు స్వేరోస్ నాయకులపై కేసులు బనాయించడం, ఒకేషనల్ కోర్సులను తీసేయడం సరికాదన్నారు.