VIDEO: 'కూటమి ప్రభుత్వం తనపై కక్షసాధింపులకు పాల్పడుతోంది'
GNTR: కూటమి ప్రభుత్వం తన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తన 20 ఎకరాల భూమికి సర్వే పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కృష్ణా నది గర్భంలో ఇల్లు కట్టిన చంద్రబాబు తనను భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.