కోళ్ల పందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
TPT: సూళ్లూరుపేట మండలం దామా నెల్లూరు అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న కోళ్ల పందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో పందాలు నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 పందెం కోళ్లు, 4 కత్తులు, 5 బైకులు, రూ. 10,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అజయ్ కుమార్ వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.