జాతీయ రహదారిపై కూరాగాయల వ్యాన్ బోల్తా

SKLM: కంచిలి జాతీయ రహదారి జాడుపూడి వద్ద శుక్రవారం కూరగాయలు లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. శ్రీకాకుళం వైపు నుండి కూరగాయలు లోడుతో ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పైనే బోల్తా పడడంతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.