బైక్ దొంగల ముఠా గుట్టురట్టు..
JGL: జగిత్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 5 చోరీ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ వెల్లడించారు. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు విచారించగా.. ధర్మపురికి బైకును తీసుకెళ్లి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియడంతో నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు.