గూడ్స్ రైలు ఢీకొని ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి
BPT: చీరాల రైల్వే స్టేషన్ లోని నాలుగో ప్లాట్‌ఫారమ్ వద్ద శనివారం పట్టాలు దాటే క్రమంలో గూడ్స్ రైలు ఢీకొని ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గూడ్స్ గార్డ్ సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై కొండయ్య మాట్లాడుతూ.. మృతుడిని గుర్తించాల్సి ఉందని, ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని కోరారు.