లంచం అడిగితే ఫిర్యాదు చేయాలి: ACB DSP
WGL: జిల్లా కేంద్రంలో ACB DSP సాంబయ్య మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం ప్రజల హక్కు అని, ఎవరైనా వేధించి ఇబ్బంది పెడితే నేరుగా తమకు తెలియజేయాలన్నారు. రాష్ట్రస్థాయి టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా లేదా డివిజన్ స్థాయి ఫోన్ నంబర్ 9154388912కు ఫిర్యాదు చేయాలన్నారు.