ఈనెల 20న జిల్లాకి సీఎం రాక..!
AKP: ఈ నెల 20న అనకాపల్లికి సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి బెల్లం మార్కెట్ యార్డులో నిర్వహించే స్వచ్ఛాంధ్రలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. సీఎం రాకతో జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.