VIDEO: 'అక్షరాంధ్ర' కేంద్రాన్ని తనిఖీ చేసిన MPDO
GNTR: తుళ్లూరులోని అక్షరాంధ్ర కేంద్రాన్ని బుధవారం ఎంపీడీఓ శిల్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ శిక్షణ పొందుతున్న వయోజనుల అభ్యసన సామర్థ్యాలను, పరీక్షల సన్నద్ధతను ఆమె స్వయంగా పరిశీలించారు. ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం నేర్పించాలని డ్వాక్రా మహిళలను ఆదేశించిన ఎంపీడీఓ, రానున్న పరీక్షలకు అభ్యర్థులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు.