గొల్లప్రోలులో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం

గొల్లప్రోలులో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం

KKD: గొల్లప్రోలు పరిధిలోని 10, 11 వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మురికి కాలువల్లో సిల్ట్ పేరుకుపోయి నీరు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు.