నిలిచిన రవాణా.. పెరగనున్న పెట్రో మంట!

నిలిచిన రవాణా.. పెరగనున్న పెట్రో మంట!

పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ ధర ఒక్కసారిగా 10 శాతం ఎగబాకి 80 డాలర్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100 డాలర్లకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీలు, వ్యాపారులు ఆయిల్, గ్యాస్ రవాణాను పూర్తిగా నిలిపివేశారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది.