పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు
AP: మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 6 రోజులపాటు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మంత్రికి మేళతాళాలు, పూర్ణ కుంభంతో ఉత్సవ కమిటీ స్వాగతం పలికింది. ఆపై స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.