ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

MNCL: పాలిటెక్నిక్ కోర్సులలో స్పాట్ అడ్మిషన్ల గడువును రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పొడిగించినట్లు బెల్లంపల్లి పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. EEE కోర్సులో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం ఉదయం 10 నుంచి 12గంటల మధ్య హాజరు కావాలన్నారు.